Managala Shasana Mahadharmam

333

ముందుమాట

ఓమౌజయా: మంగళశాసన మహాధర్మం అను పుస్తకములో 1003 ఆత్మల పారాయణముతో కూడిన “ఓమౌజయాః స్తుతి” గురించి వివరించడం జరిగింది. విశ్వమానవ దేహంలో సహజముగా మరియు ప్రకృతిసిద్ధంగా జన్మతః అందరికీ సమానంగా 1003 ఆత్మలతో మానవ దేహం జన్మించడం జరుగుతుంది. మానవ దేహంలో 9 పరమాత్మ కేంద్రాలు ఉంటాయి. 7 జీవాత్మ చక్రాలు ఉంటాయి. ఇందులో ఈ 8 పరమాత్మ కేంద్రాలలో ఒక్కొక్క కేంద్రంలో 111 ఆత్మలు ఉంటాయి. 9వ కేంద్రంలో 115 ఆత్మలు ఉంటాయి. ఆవిధంగా మొత్తం 9 కేంద్రాలలో 1003 ఆత్మలు ఉంటాయి. ఈ 1003 ఆత్మలు ఒక్కొక్క ఆత్మ మళ్ళీ 1003 జీవాత్మలతో నిండిపోయి ఉంటాయి. ఒక్క జీవాత్మ 1003 రేకులతో అవతరించి ఉంటుంది. 1003 రేకులను పరిపూర్ణంగా యోగ, ధ్యాన, తత్త్వ కుండళినీ మరియు సద్గురు దర్శన, సత్సంగముల అనుగ్రహంతో పరిపూర్ణంగా జాగృతం చేసినపుడు, జీవుడై దేహమును దర్శించిన మానవుడు ఆత్మ స్వరూపుడై సాక్షాత్ భగవంతుడిగా పారమార్థ మానవజన్మ గమ్యసిద్ధిని పొందుతాడు. కర్మజీవుడై జీవాత్మతో జన్మించిన మానవుడు స్వతంత్ర ఆత్మయై, పరమాత్మగా, సత్యస్వస్వరూపంగా అవతరించినప్పుడే మానవ జన్మ ఫలసిద్ధిని పొందగలడు.

మృత్యుజీవి మానవుడిని అమృతజీవిగా మరియు కర్మ జీవి మానవుడిని స్వయంభూఃగా, సంసార జీవి మానవుడిని పరబ్రహ్మగా, నిస్సహాయ మానవుడిని సర్వస్వతంత్రుడిగా, అల్ప మానవుడిని విశ్వమానవుడిగా, విధి బానిస మానవుడిని విధి యజమాని మానవుడిగా ఆవిర్భవింపజేయునది 1003 ఆత్మల వికాస పారాయణ జ్ఞాన చైతన్య ప్రజ్వల జ్యోతి స్వయం ప్రకాశమే “ఓమౌజయాః స్తుతి”!

భక్తోమౌజయులు ప్రతి దినము క్రమం తప్పకుండా ఆచరించవలసిన ‘సత్యస్తుతి స్థాపన’, ‘ప్రేమోజస్సోమౌజయాః స్థాపన’, ‘ప్రేమానంద యోగ స్థాపన’, ‘పూర్ణాత్మ స్థాపన’, తిధి అనుసారము ప్రతి దినము చేయవలసిన “దినఫల ప్రార్ధన”, ఏఏ రోజులలో ఏఏ ఆహారమును స్వీకరించాలో తెలిపే “ఆరోగ్య ధర్మ ఆచరణ జీవనము”, పంచాయతాల గురించి, నిత్యారాధనా అంశ వివరణలు పొందుపరచడం జరిగింది.

ప్రతి భక్తమౌజయులు ఈ పుస్తకమును చదివి, ఈ పుస్తకములో సద్గురువుల వారు సూచించినటువంటి జీవన విషయములను ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆచరించి, భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగలరని, సద్గురువుల వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదమును పొందగలరని సహృదయపూర్వకముగా ఆకాంక్షిస్తూ….

ఇట్లు

ఓమౌజయా: మహాధర్మ సేవలో

భక్తోమౌజయ బృందం

Categories: ,

Description

Managala Shasana Mahadharmam

Additional information

Weight 0.5 kg
Dimensions 26.67 × 19.05 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.