Aumaujaya Shraddhavan Labhathe Gnanam – 18 ( శ్రద్ధవాన్ లభతే జ్ఞానం – 18 )
₹200
ముందుమాట
శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార మూలాధి పరా స్వయంభూః సద్గురు పరబ్రహ్మ శ్రీ జైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహంతో ప్రతి గురువారం జరుగు శ్రీగురుగీత ప్రవచనాల పరంపరలో మూడు గురువారాల దివ్య సత్సంగాల సారాంశాన్ని ఈ గ్రంథం అందిస్తోంది.
“శ్రద్ధవాన్ లభతే జ్ఞానం – 18 (ఆత్మ ఉపాసన – గురు ఆరాధన)” అనే ఈ గ్రంథం, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే ప్రతి సాధకుని కోసం అమూల్యమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. జీవన లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది అమృతబిందువుగా మారుతుంది. జ్ఞాన మార్గంలో ప్రవేశించాలనుకున్న సాధకులకు ఇది ఒక అద్భుతమైన ఉపదేశ గ్రంథం. ఇందులోని ప్రతి ఉపదేశం, మహాగురు వారు స్వయంగా ప్రసాదించిన అమృతధార.
ఈ గ్రంథంలో అనేక ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి.
“గురు ఆనందమే ఆత్మ ఆనందము” అనే అధ్యాయంలో, గురువును ఎలా ప్రసన్నం చేసుకోవాలో, ఆయన సేవను ఎలా చేయాలో విపులంగా వివరణ ఇవ్వబడింది.
“కర్మ యోగమే మోక్ష యోగము” అనే అధ్యాయంలో, నాలుగు రకాల మనుషులు (కారణజన్ములు, కర్మ జన్ములు, క్రియా జన్ములు, సాక్షి జన్ములు) గురించి, అలాగే అమావాస్య రోజున ధ్యానం చేయగలమా అనే భక్తుల సందేహాలకు జైమహావిభోశ్రీః వారు ఇచ్చిన సమాధానాలు సమీకరించబడ్డాయి.
“భక్తి యోగమే ప్రేమ యోగము” అనే అధ్యాయంలో, నిజమైన భక్తి లక్షణాలు, భక్తుల స్వభావం, మరియు గురువును ఆనందింపజేయడానికి పాటించవలసిన విధానాలు వివరించబడ్డాయి.
ప్రతి మనిషి ఈ గ్రంథాన్ని చదివి, మహాగురు వారి బోధనలను తన జీవితంలో ఆచరించి, భౌతిక-ఆధ్యాత్మిక సర్వాంగాభివృద్ధిని పొందాలని, తద్వారా మహాగురు జైమహావిభోశ్రీః వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదాన్ని పొందాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
ఇట్లు
ఓమౌజయాః మహాధర్మ సేవలో
భక్తోమౌజయః బృందం
Description
Shraddhavan Labhate Jnanam – 18 for seekers on the path of knowledge and self-realization.
Additional information
Weight | 0.35 kg |
---|---|
Dimensions | 33.02 × 20.32 × 1.27 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.