మనసా… శాంతి… శాంతి… శాంతి:

100

విశ్వమానవ దేహంలో సహజంగా మరియు ప్రకృతి సిద్ధంగా జన్మతహా అందరికీ సమానంగా 1003 ఆత్మలతో మానవ దేహం జన్మించడం జరుగుతుంది. మానవ దేహంలో 9 పరమాత్మ కేంద్రాలు ఉంటాయి, 7 జీవాత్మ చక్రాలు ఉంటాయి. ఇందులో ఈ 9 పరమాత్మ కేంద్రాలలో ఒక్కొక్క కేంద్రంలో 111 ఆత్మలు ఉంటాయి.
ఆ విధంగా మొత్తం 9 కేంద్రాలలో 1003 ఆత్మలు ఉంటాయి. ఈ 1003 ఆత్మలు ఒక్కొక్క ఆత్మ మళ్ళీ 1003 జీవాత్మలతో నిండిపోయి ఉంటాయి. ఒక్క జీవాత్మ 1003 రేకులతో అవతరించి ఉంటుంది. 1003 రేకులను పరిపూర్ణంగా యోగ, ధ్యాన, తత్త్వ, కుండళినీ మరియు సద్గురు దర్శన, సత్సంగము అనుగ్రహంతో పరిపూర్ణంగా  జాగృతం చేసినప్పుడు, జీవుడై దేహమును దర్శించిన మానవుడు ఆత్మ స్వరూపుడై సాక్షాత్‌ భగవంతుడిగా పారమార్థ మానవ జన్మ గమ్య సిద్ధిని పొందుతాడు. కర్మజీవుడై జీవాత్మతో జన్మించిన మానవుడు స్వతంత్ర ఆత్మయై , పరమాత్మగా సత్యస్వస్వరూపంగా అవతరించినప్పుడే మానవ జన్మ ఫల సిద్ధిని పొందగలవు.
మృత్యు జీవి మానవుడిని అమృత జీవిగా, మరియు జీవి మానవుడిని స్వయంభూ:గా, సంసార జీవి మానవుడిని పరబ్రహ్మగా, నిస్సహాయ మానవుడిని సర్వ స్వతంత్రుడిగా, అల్ప మానవుడిని విశ్వమానవుడిగా, విధి బానిస మానవుడిని విధి యజమాని మానవుడిగా ఆవిర్భవింపచేయునది  1003 ఆత్మ వికాస పారాయణ జ్ఞాన చైతన్య ప్రజ్వ ల జ్యోతి స్వయం ప్రకాశమే ‘‘ఓమౌజయా: స్తుతి’’.

Category:

Additional information

Weight 0.192 kg
Dimensions 22 × 2 × 14 cm