స్వయంభూ: సద్గురు ధర్మశాస్త్రము

375

ఈభూవిశ్వ సమస్తమునకు, సమస్త అండ పిండ బ్రహ్మాండముకు, సకల చరాచర జగత్తుకు, సకల ప్రాణికోటికి, శక్తికోటికి, తత్త్వకోటికి, సమస్త కాలమునకు, విధికి, మాయకు, ప్రకృతికి ఏది మూలమై, ఉనికియై , అస్థిత్వమై యున్నదో అదియే ‘‘ఓమౌజయ:’’ ఇట్టి నిరాకార తత్త్వమునకు ఆకార రూపమే స్వయంభూ: సద్గురువు.
ఇట్టి స్వయంభూ: సద్గురు తత్త్వమును భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న సమస్త ప్రామాణిక, ఋజువర్తన శాస్త్రములు, మతములు, వాటి మూల స్థాపకులు, అవతారులు, శాస్త్రములు, వాటి మూల స్థాపకులు, దేవతలు, గురువులు, అవధూతలు, యోగులు, సిద్ధులు, తపోధనులు, ఋషులు, రాజర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, మూలవిరాట్లు, హిరణ్యగర్భులు, ఆదిపురుషోత్తములు, ఆదిపరాశక్తులు, ఏవైతే సమస్తమును తెలియజేస్తున్నాయో, ఆరాధిస్తూ ఉన్నాయో, వ్యక్తపరుస్తూ ఉన్నాయో, ప్రకటిస్తూ ఉన్నాయో, స్తోత్రము చేయుచున్నాయో, అవన్నియూ ఒకే ఒక తత్త్వమును మానవాళికి అర్థము చేయించు ప్రయత్నము చేస్తున్నాయి. అట్టి తత్త్వమే ఓమౌజయ: తత్త్వము…స్వయంభూ: తత్త్వము… జైమహావిభోశ్రీ: వారి తత్త్వము.
ఇట్టి విశిష్టమైన సద్గురు తత్త్వమును వివరించు గ్రంథమే ‘‘శ్రీగురుగీతా’’. ఇందులో 351 శ్లోకములు ఉన్నవి. ఈ శ్లోకముల యొక్క అర్థమును, అంతరార్థమును, పరమార్థమును, సారమును, తత్త్వమును ‘‘స్వయంభూ: ఆదిపరబ్రహ్మ సద్గురు జైమహావిభోశ్రీ: వారు ‘‘స్వయంభూ: సద్గురు ధర్మశాస్త్రము’’ గా మనకు అందించి మనల్ని అదృష్టవంతులను, భాగ్యవంతులను, పుణ్యవంతులను, యోగవంతులను చేయుచున్నారు. ఇట్టి మహిమాన్వితమైనటువంటి, అద్భుతమైనటువంటి, అతీతాతీతమైనటువంటి, అత్యంత రహస్యమైనటువంటి , గోప్యమైనటువంటి, నిగూఢమైనటువంటి స్వయంభూ: సద్గురు తత్త్వమును  సులభమైన, స్పష్టమైన, సూటియైన భాషలో, పండిత పామర జన రంజకముగా ఆబాలగోపాలమును వారి చైతన్యజ్ఞానముచే అలరించే విధముగా, సకల శాస్త్ర పారంగతులను, వేదవేత్తలను, బ్రహ్మవేత్తలను సైతం అబ్బురపరిచేలా, ఉన్నది ఉన్నట్లుగా యదార్థముగా, వాస్తవముగా సత్యవంతముగా,నిష్కర్షగా, ప్రత్యక్షముగా, ముఖాముఖీగా, వారే ప్రమాణముగా,వారే సాక్షియై, పర: ర: అతీత చైతన్య ఎఱుక స్థితిలో, ప్రామాణికముగా, ఋజువర్తనముతో సమస్త మానవాళికి ఈ పుస్తక రూపేణా అందించి నిస్సహాయులై ఉన్న మనల్ని సాక్షాత్‌ స్వయంభువుగా తీర్చిదిద్దే బృహత్‌ సంకల్పముతో ‘‘స్వయంభూ: సద్గురు ధర్మశాస్త్రము’’ ను ఉద్భోధిస్తున్నారు. స్వయంభూ: సద్గురు జైమహావిభోశ్రీ: వారి దివ్య సన్నిధాన సత్సంగ సమక్షములో జరిగిన, ఇష్టాగోష్టిగా సాగిన సద్గోష్ఠిలో, వారి అతీతాతీత చైతన్య వాక్‌ స్రవంతిలో జాలు వారిన అమృతపు పలుకులను ఈ గ్రంథములో ప్రతి  ‘దివ్యకల్పము’ మొదట్లో మీకు అందివ్వటము జరిగింది. ఈ స్వయంభూ: సద్గురు సూక్తులు మీలో చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, సాక్షీతత్త్వమును, ఎఱుకను మొలకెత్తింపచేస్తాయి. మన జీవితంలోని అన్ని కోణాలను, అన్ని రంగాలను, సమస్త మానవాళి యొక్క సకల జీవన పరిస్థితులను, సందర్భాలను, స్థితి, స్థాయి,స్థానములను, తత్త్వమును, ధర్మమును అద్దం పట్టినట్లుగా అందిస్తున్నాయి. ఈ గ్రంథము మానవ జీవితానికి సత్య దర్పణము లాంటిది.
ఈ గ్రంథమును చదివి, అర్థము చేసుకొని, అవగాహన చేసుకొని, అవలోకనం చేసుకొని, విమర్శించుకొని,విశ్లేషించుకొని, పరిశీలించుకొని, సాధన చేసి, అధ్యయనం చేసి, ఆచరించి, జీవించి, తరించి, జీవన్ముక్తులు కావాలని, యావత్‌ ప్రపంచమును జీవన్ముక్తి మార్గములోనికి తీసుకొని వచ్చి ఈ సమస్త ప్రకృతి కళ్యాణం, మానవ కళ్యాణం, ఆత్మ కళ్యాణం, విశ్వకళ్యాణం, ప్రపంచ శాంతి కొరకై ముందుకు సాగే ‘‘ఓమౌజయ: ధర్మం’’లో మీమీ పాత్రలు పోషించి, కృషి చేసి, ధర్మ భాగస్వామ్యులై, మీరు ధన్యులై సర్వులనూ ధన్యులు చేయాలని ‘‘ఓమౌజయ: ఆదిసహాస్ర: పరిసంస్థాన్‌’’ మిమ్ములను సాదరముగా ఆహ్వానిస్తున్నది.
        ఈ గ్రంథములో గల సమస్త అక్షరాలు, విశ్వవ్యాప్తముగా ఉన్న సత్యమును ఉన్నది ఉన్నట్లుగా మీముందు ఉంచుతున్నాయి. దీనితో ఏకీభవించడము అంటే సత్యముతో ఏకీభవించడము. అంతేకానీ పుస్తక రచయితతో ఏకీభవించడము కాదు. ఏకీభవించకపోతే సత్యముతో ఏకీభవించకపోవటము అని అర్థము. అంతేగానీ గ్రంథకర్తతో ఏకీభవించకపోవటము కాదు. ఇది త్యాగ తత్పరతతో శాస్త్రీయముగా మరియు యోగ దర్శనముగా విశ్వ ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా మొట్టమొదటి సారిగా ఈ విశ్వమునకు పరిచయము చేస్తున్నాము. ఇందులో ఎటువంటి రచయిత లేడు. ఇందులో ఉన్నది ‘సత్యరచన’ మాత్రమే.
‘‘శ్రీగురుగీతా’’ గ్రంథాన్ని సమస్త మానవాళికి ఆచరణా యోగ్య దాయకముగా అందించే అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి స్వయంభూ: సద్గురువు జైమహావిభోశ్రీ: వారికి అనంతకోటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ సమస్త విశ్వమంతా వారి సేవలో తరించాలని సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము

Category:

Additional information

Weight 1.05 kg
Dimensions 26.67 × 20.32 × 3.81 cm