పరబ్రహ్మ తత్వ దర్శనం 2

100

పరబ్రహ్మ తత్వ దర్శనం

గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయం ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తోమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.
గురుపౌర్ణిమ మహోత్సవ సందర్భంగా, రెండు వేరు వేరు ప్రదేశాలలో, జైమహావిభోశ్రీః వారు ప్రవచించిన అనుగ్రహ భాషణములు ఈ యొక్క పుస్తకం నందు ఇవ్వబడినవి.
ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం-2 (పూజించు జీవితమును – ఆరాధించు ఆత్మను) పుస్తకము నందు ఒక శిష్యునకు గురువుతో ఉండవలసిన మోక్షబంధముల గురించి వివరించారు. ఒక గురువులో తల్లి, స్నేహితుడు, ప్రేమిక, భగవంతుడు, జీవితములను ఒక శిష్యుడు బంధమును ఏర్పరుచుకుని ఎలా తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలో వివరించారు. అలాగే భౌతికముగా నాయక జీవితమును, ఆధ్యాత్మికముగా గురు జీవితమును, జీవిత పరముగా శాస్త్రజ్ఞ జీవితమును ఎలా జీవించాలో వివరించారు. భౌతికముగా బంధం, విద్య, ధనం, అధికారం, కీర్తిల యొక్క పరిమిత అశాశ్వత తత్త్వమును గురించి, ఆధ్యాత్మికముగా స్వేచ్ఛ, జ్ఞానం, చైతన్యం, ప్రేమ, కరుణల యొక్క అపరిమిత శాశ్వత తత్త్వమును గురించి బోధించారు.
అలాగే ఓమౌజయః ధర్మమును స్థాపించిన ఉద్దేశ్యమును, నేటి ప్రపంచంలో ఓమౌజయః ధర్మ ఆవశ్యకతను మరియు శక్తిపీఠము, పరాచక్రముల మహాత్యము గురించి, అవి మానవాళికి అందించే ఫలముల గురించి వివరించడం జరిగినది.
ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు కండి. ఓమౌజయః.

Description

Additional information

Weight 0.227 kg
Dimensions 13.97 × 1.27 × 21.59 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.