Aumaujayaa Naama Koti(2025)

180

ఓమౌజయాః కోటి

(”ఓమౌజయాః కోటి” అనేది భక్తోమౌజయులు తరచుగా చేసే పవిత్ర ఆచారం. ఓ ఓమౌజయాః అనే నామాన్ని కోటి (కోటి అంటే 10 మిలియన్) సార్లు వ్రాయాలి.)

నామ కోటి ఓమౌజయాః ప్రాముఖ్యత:

* భక్తి, శ్రద్ధ, సమాధానం సాధించడానికి

* మనస్సుకు స్థిరత్వం, మహాగురు వారి అనుగ్రహం పొందేందుకు

* ఓమౌజయాః కోటి వ్రాయుటవల్ల మహాగురు వారి కృపకుపాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందగలరు.

* మీ సర్వకోరికలు తీరి, మనశ్శాంతి లభించును.

* మహాగురు వారి కృపచే సర్వకార్యములు శీఘ్రముగా నెరవేరును.

* ఎవరైతే ఓమౌజయాః నామకోటిని రాస్తారో వారి భౌతిక, ఆధ్యాత్మిక సర్వ కోరికలు నెరవేరును.

* ఓమౌజయాః కోటి రాసే వారికి ఇచ్ఛాసిద్ధి, జ్ఞాన సిద్ధి, క్రియా సిద్ధి, మోక్ష సిద్ధి ఫలించును.

* ఎవరైతే నామ కోటి రాస్తారో దానిని ఎటువంటి అంతరాయం లేకుండా పరిపూర్ణం చేస్తారో వారు సాక్షాత్ భగవత్ స్వరూపులుగా అవతరిస్తారు. వారు విశ్వ కళ్యాణంకు ఒక ఆశీర్వాదంగా ఆవిర్భవిస్తారు.

* ఓమౌజయాః నామ కోటి రాసిన పరమ భక్తులను చూసినా, వారితో సమయం గడిపినా పుణ్యం ప్రాప్తిస్తుంది.

* ఓమౌజయాః నామ కోటి పరిపూర్ణ భక్తి ఫలమే కాకుండా అఖండమైన మానవ జన్మ పూర్ణాత్మ జీవితాన్ని ప్రసాదిస్తుంది.

ఓమౌజయాః నామ కోటి విధి విధానాలు

వ్రాయడం ఎలా మొదలుపెట్టాలి?

* ఓమౌజయాః కోటి పుస్తకం గురువారం కొనుగోలు చేయాలి.

* మహాగురు వారు జన్మించిన శుభ దినమైన బుధవారం రోజున రాయడం మొదలు పెట్టడం శుభకరం.

* ఓమౌజయాః కోటి పుస్తకముకు ఓమౌజయాః ఆజ్ఞ తిలకమును పెట్టి, మీరు ఓమౌజయాః ఆజ్ఞ తిలకమును పెట్టుకొని, శ్రీమూర్తి దగ్గర నాలుగు ఒత్తులు వేసి, నాలుగు దీపాలను కొబ్బరినూనెతో వెలిగించి, నాలుగు గులాబీ పూలను శ్రీమూర్తి ముందు పెట్టి, నాలుగు అగరుబత్తులను వెలిగించి, స్వయంభూః సద్గురు ధర్మశాస్త్ర గ్రంథములో నాల్గవ మహా దివ్యకల్పమును చదివి, నమోస్తు స్థాపించి ఘణస్థాపన చేసి, నాలుగు కొబ్బరికాయలు కొట్టి దానికి బెల్లమును, మురమురాలను కలిపి ఆ ప్రసాదమును అందరికీ పంచి, శ్రీమూర్తికి హారతి ఇచ్చి నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకొని ఓమౌజయాః నామకోటిని రాయడం ప్రారంభించవలెను.

ఎలా వ్రాయాలి?

* స్వచ్ఛమైన, పవిత్రమైన, నిష్టా గరిష్ఠమైన భక్తితో, శ్రద్ధా విశ్వాసాలతో, త్రికరణ శుద్ధిగా, ఏకాగ్రత గల మనస్సుతో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోని వ్రాయవలెను.

* ప్రతి నామం స్పష్టంగా, శుద్ధంగా వ్రాయాలి.

* ప్రతి పేజీపై తెలుగులో “ఓ ఓమౌజయా “ అని లేదా ఇంగ్లీష్ లో “O Aumaujayaa” అని లేదా హిందీలో  “ओ ओमौजयाः” అని  శుద్ధంగా వ్రాయాలి.  ఓ అని ఒక గడిలో, ఓమౌజయాః అని మరొక గడిలోను వ్రాయరాదు. ఓ ఓమౌజయాః అని మొత్తం రాసుకుంటూ ఒక క్రమపద్ధతిని అవలంభించాలి.

* “ఓ ఓమౌజయాః” అని తెలుగులో ప్రారంభిస్తే పుస్తకమంతా తెలుగు లోనే రాయాలి. పుస్తకాన్ని ఏ భాషలో ప్రారంభిస్తే అదే భాషలో రాయాలి.

* భక్తమౌజయులు వ్రాతఫలముతో పాటు స్మరణఫలితము కూడా పొందుటకు మనస్సులో స్మరించుకుంటూ, ఓమౌజయాః దివ్య పాదుకలపై, ఓమౌజయాః ఆజ్ఞాతిలకముపై, ఓమౌజయాః జయకేతనంపై దృష్టి పెట్టి వ్రాసినచో అది అత్యంత పుణ్యదాయకం.

ఎప్పుడు వ్రాయాలి?

* ప్రతిరోజూ ఓమౌజయాః కోటిని రాయడానికి కొంతసేపు కేటాయించడం మంచిది. రోజుకు కనీసం ఒక పేజి అయినా క్రమం తప్పకుండా రాయడం ఉత్తమం.

ఎన్ని రాయాలి?

* అన్నవృద్ధి కొరకు – 2 లక్షలు

* బల వృద్ధి కొరకు – 1 లక్ష

* ధన వృద్ధి కొరకు – 3 లక్షలు

*ఓమౌజయాః కోటి

* సుఖ వృద్ధి కొరకు – 2 లక్షలు

* ఆదర్శ దాంపత్య జీవితమునకు – 3 లక్షలు

* సంతాన సమృద్ధి కొరకు – 6 లక్షలు

* ఆరోగ్యాభివృద్ధి కొరకు – 2 లక్షలు

* ఆపదలు తొలగుట కొరకు – 3 లక్షలు

* విరోధం తొలగుటకు – 3 లక్షలు

* ప్రాపంచిక భోగ భాగ్యాలకై – 4 లక్షలు

పూర్తయ్యాక

ఓమౌజయాః కోటి నామం పూర్తి చేసిన తర్వాత పుస్తకాలని మీ దగ్గరలో ఉన్న ఓమౌజయాః ఊర్జీశా క్షేత్రములలో ఉన్నటువంటి క్షేత్రాధికారికి ఇవ్వవలెను.

Categories: ,

Additional information

Weight 0.45 kg
Dimensions 20.32 × 12.7 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.