AUYSA -12-నిజాయితీ నీకు నిజమైన మార్గదర్శి

149

WE AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య జైమహావిభోశ్రీః వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ  యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
WE AUYSA ద్వారా ప్రతి యువకుడిని పూజ్య జైమహావిభోశ్రీః వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ WE AUYSA – 12 ‘‘నిజాయితీ నీకు నిజమైన మార్గదర్శి’’ అను పుస్తకంలో  విధ్యార్థులు చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలో జైమహావిభోశ్రీః వారు చాలా చక్కగా వివరించారు. మనందరికీ ముఖ్యంగా యువతకు ప్రధాన ఐదు సంపదలైన వ్యక్తిత్వం, జ్ఞానం, కాలం, నైపుణ్యత మరియు ఆత్మ విశ్వాసము గురించి జైమహావిభోశ్రీః వారు వివరించారు.
అలాగే విజయ సూత్రాల గురించి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ ( ఆత్మ న్యూనత), సుపీరియారిటీ కాంప్లెక్స్‌ (ఆత్మ అతి విశ్వాసం) మరియు హ్యూమన్‌ కాంప్లెక్స్‌ (సహజమైన  విశ్వాసం)  గురించి, ఇంకా పుట్టిన తేదీని బట్టి ఒక్కొక్కరు ఎలా ఉండాలో జైమహావిభోశ్రీః వారు చాలా చక్కగా వివరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.173 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm