ఆధునిక మహిళ – 11 – కన్నీళ్లు లేని స్త్రీ – శాంతి భద్రతలో స్త్రీ ప్రయాణం

158

ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.

ఆధునిక మహిళ-11 “కన్నీళ్ళు లేని భూదేవి – శాంతిభద్రతలో స్త్రీ ప్రయాణం” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి రెండు ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.

స్త్రీ జాతికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి “శ్రీవిద్య” గురించి, స్త్రీలలో ఉండే 11 రకాలైనటువంటి “ఏకాదశ లక్ష్ముల” గుణగణాల గురించి, వారి స్వభావం, ప్రకృతి, తత్త్వముల గురించి వివరించబడినది. అలాగే స్త్రీకి కుటుంబంలో సమాజంలో ఏర్పడే వాతావరణం, పరిస్థితి, సందర్భం,కారణం, కార్యముల గురించి వివరించబడినది. అలాగే స్త్రీ తన సవాళ్ళైన ద్వేషమును, ఈర్ష్యను, అసూయను, అవమానమును, అగౌరవమును ఎలా జయించాలో వివరింపబడినది.

ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.229 kg
Dimensions 21.59 × 2 × 13.97 cm