ఆధునిక మహిళ – 3 – శ్రీచక్ర మహిమ-స్త్రీ విజయ రహస్యం

80

స్త్రీలను శక్తివంతులుగా, చైతన్యమూర్తులుగా, ప్రేమ స్వరూపులుగా, జ్ఞానసంపన్నులుగా తయారు చేసి, వారి స్వేచ్ఛాస్వతంత్రాలను హక్కులను వారికి ప్రసాదించి భౌతికముగా ఆధ్యాత్మికముగా వారి యొక్క స్థితి స్థానం స్థాయిలను వారికి అందించి వారిలోని ప్రజ్ఞాపాటవాలను సృజనాత్మకతను వెలికితీసి వారిని ఒక ప్రపంచశక్తిగా, ఆధ్యాత్మిక స్పూర్తిగా అవతరింపచేసి ఈ భారతావనికి యావత్‌ జగత్తుకు వారిని వెలుగు దివ్వేలుగా చేసి, ఆ  వెలుగు విశ్వవ్యాప్తమై విరాజిల్లేలా చేయడానికే ‘‘స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారి దివ్య హస్తాలతో ప్రారంభించబడినదే ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
ఆధ్యాత్మిక జగత్తులో మహిళ యొక్క స్థితి, స్థాయి, స్థానమును తిరిగి వారికి హస్తగతం చేయడమే‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’ యొక్క ముఖ్యోద్దేశం! ఏ స్త్రీ కంటిలో కన్నీటి చుక్క రాకుండా వారిని ఆరోగ్యంగా, శాంతిగా, తృప్తిగా, ప్రేమగా, ఆనందముగా, సత్సంబంధాలతో, ఆర్థిక స్వాలంబనతో,విజయాభివృద్ధులతో, కుటుంబిక, సామాజిక విజయముతో వారిని తయారుచేసి, వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపింపజేసి జీవన్ముక్తులుగా చేయుటకు ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’ పాటుపడుతుంది.
ఇది ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’ ద్వారా విడుదలైన మూడవ పుస్తకం. ‘‘ఆధునిక మహిళ-3,స్త్రీ తత్త్వ స్వస్వరూప సాక్షాత్కారం’’ అను ఈ పుస్తకంలో జైమహావిభోశ్రీ: వారు మహిళలకు ప్రత్యేకముగా బోధించిన రెండు సత్సంగాలను మీకు అందిస్తున్నాము.
స్త్రీ ఎలా ధనమును, విద్యను సంపాదించుకోవాలి, సంకల్పాను ఎలా ఫలింపచేసుకోవాలి, ఎలా త్రికాలాలను జయించి, తనకు తానే విధాతగా అవతరించాలి, తన దేహ పవిత్రతను ఎలా కాపాడుకోవాలి,తన మనోశక్తిని ఎలా సద్వినియోగ పరుచుకోవాలి, ప్రకృతి మాత యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, తనలోని స్త్రీ తత్త్వ స్వస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకొని, తాను జీవన్ముక్తురాలు కావాలో జైమహావిభోశ్రీ: వారు ఈ పుస్తకం ద్వారా సవివరంగా తెలియజేశారు.అలాగే స్త్రీ యొక్క మానసిక వ్యవస్థలను మరియు శారీరక అవస్థను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో తత్సంబంధిత మానసిక సూత్రాలను, ఆహారపుటవాట్లను తదనుగుణంగా ఏర్పరుచుకోవసిన జీవన సరళిని జైమహావిభోశ్రీ: వారు ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు.
ఒక తల్లి బిడ్డకు బోధించినంత సులువుగా జైమహావిభోశ్రీ: వారు మహిళకు తమ జీవనవిధాన తీరుతెన్నుల గురించి వివరించారు. మీరు ఈ పుస్తకం చదివితే ప్రకృతి మాతయే జైమహావిభోశ్రీ: వారి ద్వారా తన రహస్యాలను తాను వెల్లడిస్తుందా అనిపిస్తుంది. కాబట్టి మహిళలారా! ఈ పుస్తకాన్ని చదివి అందరిచే చదివింపజేయడి. మీరుధన్యులై పదిమంది జీవితాను ధన్యం చేయండి!

Category:

Description

Stri Tatva Swaswaroopa Saakshaatkaaram-AVMS-3-M

Additional information

Weight 0.19 kg
Dimensions 21.59 × 2 × 13.97 cm