ఆధునిక మహిళ – 10 – ప్రస్తుతంను గౌరవించు – జీవితమును ఆనందించు

121

ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.

ఆధునిక మహిళ-10 “ప్రస్తుతమును గౌరవించు – జీవితమును ఆనందించు” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి రెండు ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.

ఈ పుస్తకం ద్వారా జైమహావిభోశ్రీః వారు ఒక స్త్రీ సమస్యను ఎలా చూడాలి, ఎలా గెలవాలి,
భర్తతో, కుటుంబీకులతో, బంధువులతో, పరాయివారితో ఎలా మెలగాలో వివరించారు. అలాగే ఎక్కడ కష్టపడాలో, ఎక్కడ సుఖపడాలో, ఎక్కడ ముందుండాలో, ఎక్కడ వెనుకబడాలో, ఎక్కడ గెలవాలో, ఎక్కడ ఓడిపోవాలో చాలా చక్కగా వివరించారు. అలాగే పువ్వులతో ఓమౌజయాః అనుగ్రహమును ఎలా స్వీకరించాలో, ఏ వారం ఏ పువ్వును ధరించాలో వివరించారు. అలాగే ఒక స్త్రీ రాగద్వేషములను స్వార్థ అహంకారములను ఎలా గెలవాలో వివరించారు. అలాగే రాగం యొక్క మూడు పాదములైన ఇష్టము, ప్రియము, ఆకర్షణలను తన జీవితములో ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు.

ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.192 kg
Dimensions 21.59 × 2 × 13.97 cm