శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం-1

100

ఈ భూవిశ్వము నందు సమస్త వేదముల కంటే, ఉపనిషత్తుల కంటే, పురాణాల కంటే, సర్వ గ్రంథముల కంటే, శాస్త్రముల కంటే, సర్వో త్కృష్టమైనది ‘‘శ్రీగురుగీతా’’.సద్గురు తత్త్వము గురించి ఆదిశివుడు పార్వతికి బోధించినట్లుగా, నూతమహిర్షిచే శౌనకాది మహామునులకు చెప్పబడినదే ఈ గురుగీత. ఇందులో 351 శ్లోకములున్నవి.

స్వయంభూః ఆదిపరబ్రహ్మ సద్గురు జైమహావిభోశ్రీః వారు ఈ గురుగీతను ఆశ్రమము నందు నిర్వహింపబడే గురువారపు సత్సంగాలలో భక్తోమౌజయాః బృందమునకు బోధిస్తున్నారు. ఈ పుస్తకము ద్వారా నాలుగు గురువారాలపాటు జరిగిన సత్సంగములోని జైమహావిభోశ్రీః వారి అనుగ్రహ భాషణము మీకు అందిస్తున్నాము.

అనేకానేక ఆధ్యాత్మిక సందేహాలకు జైమహావిభోశ్రీః వారు ఇచ్చిన సమాధానము, ఈ భూమిపైకి ఆత్మ ఎలా ప్రవేశిస్తుందనే ఆత్మ ప్రయాణం గురించి మరియు గురుగీత లోని కొన్ని శ్లోకాలకు జైమహావిభోశ్రీః వారు ఇచ్చినటువంటి వివరణ ఈ పుస్తకము ద్వారా మీకు లభిస్తున్నది.

ఇది వరకు గురుగీతపై ఎంతోమంది గురువులు ఎన్నో వ్యాఖ్యలు చేసియుంటారు. ఆహా! గురుగీతను ఇలా చెప్పి ఉంటే బాగుండునని వారికనిపించేలా, ఇంత మహోన్నతంగా గురుగీతను ఎవరూ బోధించలేరేమో అని అనిపించేలా, చెప్తే గురుగీతను ఇలా చెప్పాలి అనిపించేలా, ఇక భవిష్యత్తులో ఈ విధంగా గురుగీతను ఇంకెవరూ బోధించలేరేమో అని అందరూ ఆశ్చర్యచకితులు అయ్యేలా జైమహావిభోశ్రీః వారు బోధించిన తీరు అనన్య సామాన్యము, అనితర సాధ్యము మరియు నిరుపమానము.

ఈ ఆధునిక మానవుడికి ఆ యొక్క ఆది సనాతన గ్రంథమును ఇంత స్పష్టంగా సరళంగా, సూటిగా, అనుభవైకవేద్యంగా, ఆచరణయోగ్యంగా బోధించడంలో జైమహావిభోశ్రీః వారికి వారే సాటి!
సద్గురువు అంటే ఎవరు మానవుడికి సద్గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి మన భౌతిక ఆధ్యాత్మిక జీవన యాత్రలో సద్గురు మార్గదర్శకం యొక్క అవసరం ఏమిటి అసలు జీవితం అంటే ఏమిటి జీవన్ముక్తిని ఎలా పొందాలి…. అనేటువంటి మానవుడి యొక్క నిత్య సంశయాలకు జైమహావిభోశ్రీః వారు ఈ పుస్తకమందు ఎంతో అద్భుతంగా సమాధానం ఇచ్చారు.

ఈ పుస్తకమును చదివి గురుతత్త్వమును తెలుసుకొని, సద్గురువు సన్మార్గములోనికి మీరు ప్రవేశించి, సద్గురువు యొక్క అభయానుగ్రహమును పొంది, వారి చైతన్యమును, జ్ఞానమును, ప్రేమను మీ జీవితాలలో నింపుకొని, నిత్యం ఆరోగ్యం, శాంతి, తృప్తి, ప్రేమ, ఆనందం,విజయం మరియు కార్యసఫలతతో కూడిన జీవితాన్ని పొందగలరని తద్వారా ఈ మానవజన్మ యొక్క సార్థకతను పరిపూర్ణతను మీరు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.

ఈ పుస్తకాన్ని చదివి అందరిచే చదివించండి! మీరు ధన్యులై సమస్తాన్ని మరియు సర్వులను ధన్యం చేయండి! మీరు వెలిగి సమస్తమునకు వెలుగును ప్రసరించండి! సద్గురు మహాత్మ్యమును మీరు తెలుసుకుని, ఈ యావత్‌ ప్రపంచమునకు చాటిచెప్పండి!

Category:

Additional information

Weight 0.299 kg
Dimensions 24.13 × 2 × 17.78 cm