శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం-4

120

స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రతి గురువారం పరమ శివుడు పార్వతికి గురుతత్త్వ మహాత్మ్యమును గురించి బోధించినటువంటి ‘‘శ్రీగురుగీతా’’ అను గ్రంథముపై సత్సంగములను భక్తోమౌజయులకు బోధిస్తూ, వారిని చైతన్యపరచి తరింపజేస్తూ వస్తున్నారు.

‘‘శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం -4 సద్గురు మార్గ దర్శనం – యోగతత్త్వ మహిమ’’ అను ఈ పుస్తకం ద్వారా నాలుగు గురువారపు సత్సంగముల యొక్క సారాంశము అందివ్వడం జరిగినది.

ఆధ్యాత్మికంలో ముద్రావిజ్ఞానం యొక్క ఆవశ్యకత గురించి, సత్యమైనటువంటి మరియు అసత్యమైనటువంటి గురువును ఎలా గుర్తించాలనే విషయమును గురించి ఈ పుస్తకము నందు వివరించబడినది.

మానవ జీవితమును నమ్మకవ్యవస్థ ఏవిధంగా ప్రభావితం చేస్తున్నది అన్న విషయం గురించి, తొమ్మిది రకాల మనస్తత్వాలను గురించి, నవగ్రహాలు మానవుడిపై ఎట్టి ప్రభావాన్ని కలిగించుచున్నవి అన్న విషయమును గురించి, మన దేహంలోని ఏడు శక్తికేంద్రాలను జాగృతపరచుకొనుటకై సాధన యొక్క వివరణ ఈ పుస్తకము నందు ఇవ్వబడినది.

సర్వాతీతమైనటువంటి గురుతత్త్వ విశిష్టతను గురించి, కర్మ, విధి, మనసు గురించి, శాస్త్రాతీతమైనటువంటి చైతన్య తత్త్వమును గురించి, గురువాక్‌ మహాత్మ్యమును గురించి, శోకమోహములను ఎలా జయించాలి అనే విషయములను గురించి, మరణం యొక్క మర్మమును గురించి, మానవ జన్మకు గురువు యొక్క ఆవశ్యకతను గురించి, గురువుకు శరణాగతి చెంది ఎలా తరించానే విషయమును గురించి, ఈ పుస్తకం నందు ఇవ్వబడినది.

గురు సత్సంగ అంగాలైనటువంటి శ్రవణం, దర్శనం, మననం, భాషణం, జీవనము గురించి, మరణమును జయించు విద్యను గురించి, మానవ జన్మ నిస్సహాయత గురించి, ఖేచరీ ముద్ర మహాత్మ్యము గురించి, నిద్రావస్థ మరియు సుషుప్తావస్థ యందు చైతన్యవంతముగా ఎలా ఉండానే విషయం గురించి, ఆత్మసాక్షాత్కార సాధన గురించి ఈ పుస్తకం నందు వివరించబడినది.

కావున ఆత్మీయులారా! ఈ పుస్తకమును మీరు చదివి, సద్గురు చైతన్య మహిమను గ్రహించి, వారి అనుగ్రహమునకు పాత్రులై, అందరిచే ఈ పుస్తకమును చదివించి, వారిని కూడా చైతన్యపరచి, వారిని కూడా సద్గురు కృపకు పాత్రులను చేయండి! మీరు తరించి అందరినీ తరింపజేయండి! ఓమౌజయః

ఇట్లు
ఓమౌజయ: మహాధర్మ సేవలో
భక్తోమౌజయ: బృందం, హైదరాబాద్‌.

 

Category:

Additional information

Dimensions 24.13 × 2 × 17.78 cm