శ్రద్ధవాన్ లభతే జ్ఞానం-5
₹130
స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రతి గురువారము ‘‘ఓమౌజయః ఊర్జీశా నిలయం (ప్రజ్ఞాన పీఠం)’’, హైదరాబాద్ నందు గురుతత్త్వ విశిష్టతను యావత్ విశ్వమునకు తెలియజేసినటువంటి శ్రీగురుగీతా గ్రంథముపై ప్రవచిస్తారు. ఈ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం -5 ఫలించే ప్రార్థన సిద్ధించే జీవితం అను పుస్తకము ద్వారా నాలుగు గురువారాల సత్సంగములు యొక్క సారాంశమును మీకు అందించబడినది.
ఒక శిష్యుడు గురువుకు చేయదగిన సేవలైనటువంటి స్థానసేవ, అంగసేవ, భావసేవ మరియు ఆత్మసేవ అను వాటి గురించి ఎంతో విపుముగా జైమహావిభోశ్రీః వారు ఈ సత్సంగమందు విశదీకరించారు. అలాగే ధ్యానము అనగానేమి మరియు ధ్యానంలో ఉన్న దశలైనటువంటి, వైఖరి, మధ్యమ, పశ్యంతి, పరా గురించి ఎంతో చక్కగా వివరించారు.
ప్రతి మానవుడు ఈ పుస్తకమును చదివి, తన జీవితము నందు సద్గురువుల వారు బోధించినటువంటి జీవన విషయమును ఆచరించి భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగలరని, సద్గురువుల వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదమును పొందగరని సహృదయపూర్వకముగా ఆకాంక్షిస్తూ….
సదా ఓమౌజయః మహాధర్మ సేవలో
ఓమౌజయః సేవక బృందము,
హైదరాబాద్
Additional information
| Weight | 0.456 kg |
|---|---|
| Dimensions | 25.4 × 19.5 × 2.54 cm |








