శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం-6

130

స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రతి గురువారము ‘‘ఓమౌజయః ఊర్జీశా నిలయం, హైదరాబాద్‌ నందు గురుతత్త్వ విశిష్టతను యావత్‌ విశ్వమునకు తెలియజేసినటువంటి శ్రీగురుగీతా గ్రంథముపై ప్రవచిస్తారు. ఈ ‘‘శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం-6 సన్మార్గ దర్శనం -సజ్జన జీవితం’’ అను పుస్తకం ద్వారా నాలుగు గురువారాల సత్సంగముల యొక్క సారాంశమును మీకు అందిస్తున్నాము.
ఈ పుస్తకంలో మనం జీవించవలసిన నాలుగు రకాల జీవితాలైన యోగ్యతానుసార జీవితం, బాధ్యతానుసార జీవితం, భావానుసార జీవితం, ఆత్మానుసార జీవితము గురించి, సద్గురు క్షేత్ర మహాత్మ్యము గురించి, సద్గురు స్మృతి, దర్శనం, ధ్యానము మహాత్మ్యము గురించి, సమాధి స్థితి గురించి అద్భుతంగా వివరించారు.
అలాగే భక్తి మరియు శ్రద్ధ గురించి మరియు ప్రసిద్ధ బౌద్ధ గురువు బోధిధర్మ మరియు అతడి శిష్యుడు సూజన్‌ మధ్య జరిగిన ఒక కథ ద్వారా జీవన్ముక్తికి గల ఆటంకాలను మరియు వాటిని అధిరోహించే మార్గాలను చాలా చక్కగా విపులీకరించారు. ఇంకా ప్రార్థన యొక్క మహాత్మ్యము గురించి, మన జీవితంలో తల్లి పోషించే పాత్ర మరియు గురువు పోషించే పాత్ర గురించి, ఉపవాసము యొక్క గొప్పతనము మరియు ఆచరించు విధానమును, మరియు శిష్యుడికి ఉండవలసిన 27 లక్షణాలను మరియు వాటిని పొందడానికి మార్గాలైన సేవ, దానం, ధ్యానం, సత్సంగం, సత్ప్రచారముల గురించి అద్భుతంగా విశదీకరించారు.
శిష్య ధర్మాలు, విధులు, శిష్యుడి జీవన విధానము గురించి, జాన్‌ఫర్డ్‌ అనే తత్త్వవేత్తకు మరియు చాన్‌జూ అనే గురువు మధ్య జరిగిన కథ ద్వారా జీవన్ముక్తిని పొంది, గురువు కావడానికి సూత్రాలను మరియు గురువు గొప్పతనాన్ని, గురురూప మహత్మ్యాన్ని చాలా చక్కగా ఉపదేశించారు.
ప్రతి మానవుడు ఈ పుస్తకాన్ని చదివి, తన జీవితము నందు సద్గురువుల వారు బోధించినటువంటి జీవన విషయములను ఆచరించి, భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగలరని, సద్గురువుల వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదమును పొందగలరని సహృదయపూర్వకముగా ఆశిస్తూ…
సదా ఓమౌజయః మహాధర్మ సేవలో
ఓమౌజయః సేవక బృందము,
హైదరాబాద్‌

Category:

Additional information

Weight 0.33 kg
Dimensions 24.13 × 2 × 17.78 cm