శ్రద్హవాన్ లభతే జ్ఞానం – 16
₹200
- Cash on delivery on every order
- Delhivery tracking shipped from Hyderabad
- WhatsApp help before and after you buy
17 books in this series
Complete the శ్రద్ధవాన్ లభతే జ్ఞానం series
Description
శ్రద్హవాన్ లభతే జ్ఞానం – 16
ఓమౌజయః శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రతి గురువారము హైదరాబాద్ క్షేత్రము నందు గురుతత్త్వ విశిష్టతను తెలియజేసినటువంటి శ్రీగురుగీత గ్రంథముపై ప్రవచిస్తారు. ఈ పుస్తకము నందు మూడు గురువారాల శ్రీ గురుగీత దివ్యానుగ్రహ సత్సంగముల యొక్క సారాంశము మీకు అందించబడినది.
శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్ 16 ‘హిమాలయములో మహాగురు బోధ” అను ఈ పుస్తకంలో గురువు యొక్క స్వస్వరూపమును, ఆ స్వస్వరూప దర్శనం వల్ల కలిగే ఫలితాల గురించి వివరణ, అవిద్య, మాయ, భ్రాంతి గురించి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల గురించి జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించారు.
ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా బంధువులతో ఎలా ఉండాలి, మనిషి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తము ఉంటుందా, ఉంటే అది ఏమిటి, మాంసాహారం తినవచ్చా ఇలాంటి భక్తోమౌజయులు వేసిన పలు రకాల ప్రశ్నలకు జైమహావిభోశ్రీః వారు సమాధానం ఇవ్వడం జరిగింది.
గురువు రూపం యొక్క మహత్మ్యం గురించి, గురువు యొక్క దర్శనం దేని కొరకో, గురువు యొక్క రూపం దేని కొరకో, ఆయన రూపం వల్ల ఉపయోగాలు, లాభాలు, ప్రయోజనాలు, ఫలాలు, శుభాలు ఏమున్నాయి, అసలు గురుదర్శనం ఎందుకు చేసుకోవాలి, గురువును ఏ దృష్టితో చూడాలి అనే అంశాల గురించి జైమహావిభోశ్రీః వారు అందరికీ అర్థమయ్యే విధంగా, సరళమైన భాషతో, చిన్న కథలతో వివరించడం జరిగింది.
ప్రతి మానవుడు ఈ పుస్తకమును చదివి, తన జీవితము నందు జైమహావిభోశ్రీః వారు బోధించినటువంటి జీవన విషయములను ఆచరించి, భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగలరని, జైమహావిభోశ్రీః వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదమును పొందగలరని సహృదయపూర్వకముగా ఆకాంక్షిస్తూ…..
ఇట్లు
ఓమౌజయాః మహాధర్మ సేవలో
భక్తోమౌజయ బృందం
Additional information
| Weight | 0.430 kg |
|---|---|
| Dimensions | 25.4 × 19.5 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.






















Reviews
There are no reviews yet.