ఆధునిక మహిళ – 14 – సత్యం కోసమే ప్రాణ త్యాగము చేసే స్త్రీ ప్రకృతి మాత అవ్వడానికి

166

ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని
స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ
సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.

ఆధునిక మహిళ-14 “సత్యము కోసం ప్రాణత్యాగము చేసే స్త్రీ ప్రకృతి మాత అవుతుంది” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి రెండు ఓమౌజయాః  విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.

ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు ఒక మహిళకు ఉండాల్సిన ఐదు అవతారాలైన
మాతృ స్వరూపం, ధనం విషయంలో సహన స్వరూపం, రాజకీయ విషయంలో వేగంగా స్పందించే స్వరూపం, విచక్షణా స్వరూపం మరియు ముందుచూపుల గురించి చాలా చక్కగా బోధించారు.
ఇంకా సంకల్పశక్తి అంటే ఏమిటి?, సంకల్పంనకు సప్తసూత్రాలైన గతం శుభదాయకం, భవిష్యత్తు విజయదాయకం, ప్రస్తుతం లాభదాయకం, ప్రయాణం అభివృద్ధి దాయకం, అనుభవం మరియు జీవితం చైతన్యదాయకంల గురించి జైమహావిభోశ్రీః వారు వివరించారు.

ఇంకా ఒక మహిళకు మోక్షదాయకాలైన శ్రవణం, దర్శనం, భాషణం, మననం, దానంల గురించి అలాగే ఒక మహిళకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మరియు పరిష్కరించుకోవాలో అనే విషయాల గురించి జైమహావిభోశ్రీః వారు విపులీకరించారు.

ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.227 kg
Dimensions 21.59 × 2 × 13.97 cm