Shraddhavan Labhathe Gnanam ( శ్రద్ధవాన్ లభతే జ్ఞానం -17 )
₹200
ముందుమాట
శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రతి గురువారము గురుతత్త్వ విశిష్టతను తెలియజేసినటువంటి శ్రీగురుగీత గ్రంథముపై ప్రవచిస్తారు. ఈ పుస్తకము నందు మూడు గురువారాల శ్రీగురుగీత దివ్యానుగ్రహ సత్సంగముల యొక్క సారాంశము మీకు అందించబడినది.
“శ్రద్ధవాన్ లభతే జ్ఞానం – 17 (త్రికాల జ్ఞానం)” అనే ఈ గ్రంథం ఆధ్యాత్మిక మార్గంలో నడిచే సాధకులకు ఒక అమూల్యమైన గ్రంథంగా నిలుస్తుంది. అసలు జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన ప్రతి వ్యక్తికి, ఈ గ్రంథం ఒక అమృత బిందువుగా మారుతుంది. జ్ఞాన మార్గంలో ప్రవేశించాలనుకునే ప్రతి సాధకునికీ, ఈ గ్రంథం ఒక అద్భుతమైన ఉపదేశ శాస్త్రంగా మారుతుంది. ఇందులోని ప్రతి ఉపదేశం మహాగురు వారి ద్వారా వెలువడిన అమృతధార.
ఈ గ్రంథంలో ప్రాముఖ్యత కలిగిన అనేక విషయాలను చర్చించబడింది. “ఆత్మ నివేదన మహత్మ్యం” అనే అధ్యాయంలో నివేదన యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది. నివేదన అంటే ఏమిటి, దానిని ఎందుకు ఇవ్వాలి. నివేదన ద్వారా సాధకుడు ఏ విధంగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలదు అనే అంశాలను వివరించబడింది. అలాగే, “ఓమౌజయా:” అనే మంత్రాన్ని ఎందుకు జపించాలి. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలను ఈ అధ్యాయంలో విపులంగా విశ్లేషించబడింది.
“33 తత్త్వ విద్యలు” అనే అధ్యాయంలో 33 తత్వాల గురించి వివరణ, ఉపాసన అంటే ఏమిటి? ఉ పాసనలోని అంతరార్థం ఏమిటి? ఉపాసన విధానం ద్వారా మనస్సును స్థిరపరచి దైవాన్ని ఎలా చేరుకోవచ్చో ఈ గ్రంథంలో వివరించబడింది. అదనంగా, సేవ, దానం, ధ్యానం, సత్సంగం, సత్ప్రచారాల ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, వీటిని పాటించడం ద్వారా సాధకుడు జీవితాన్ని ధర్మమార్గంలో ఎలా నడిపించగలదో స్పష్టంగా తెలియజేయబడింది.
“సాధనలు – ఉపాయాలు” అనే అధ్యాయంలో ఇంద్రియ నియంత్రణ, మనస్సు స్థిరత, ఋతువుల విధానం, మరియు ప్రకృతితో మనం ఎలా అనుసంధానమవ్వాలి అనే అంశాలు చర్చించబడతాయి. ప్రయాణం అంటే ఏమిటి? మన జీవన ప్రయాణం ఏ విధంగా ఉండాలి? అలాగే, ప్రయత్నం అంటే ఏమిటి? అనే విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడతాయి.
ప్రతి మానవుడు ఈ పుస్తకమును చదివి, తన జీవితము నందు మహాగురు వారు బోధించినటువంటి జీవన విషయములను ఆచరించి, భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగలరని, మహాగురు జైమహావిభోశ్రీః వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదమును పొందగలరని సహృదయపూర్వకముగా ఆకాంక్షిస్తూ….
ఓమౌజయా: మహాధర్మ సేవలో
భక్తోమౌజయా బృందం
Description
Shraddhavan Labhathe Gnanam ( శ్రద్ధవాన్ లభతే జ్ఞానం -17 )
Additional information
Weight | 0.35 kg |
---|---|
Dimensions | 33.02 × 20.32 × 5.08 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.