ఆధునిక మహిళ – 4 – శ్రీచక్రమహిమ-స్త్రీ విజయ రహస్యం

60

స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళలకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారము హైదరాబాద్‌ ఆశ్రమము నందు జైమహావిభోశ్రీః వారి యొక్క దివ్య సత్సంగాలు మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించబడును. ఈ పుస్తకములో జైమహావిభోశ్రీః వారి యొక్క ఒక దివ్య సత్సంగములలోని విషయాలను మీకు అందించడం జరిగినది.
ఇది ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి ద్వారా వెలువడిన నాలుగవ పుస్తకం. ఈ ఆధునిక మహిళ-4 (స్త్రీచక్రం మహిమ – స్త్రీ విజయ రహస్యం) అను పుస్తకంలో స్త్రీలకు ప్రత్యేకమైన శ్రీచక్ర ముద్రను, శ్రీ మంత్రమును, ఈ ధ్యానమునకు దృష్టిని చెప్పడము జరిగినది. అలాగే స్త్రీలు ఏ సమయము నందు నిద్రించాలి, ఏ సమయమునందు నిద్రించరాదు, అన్న విషయములను గురించి, బ్రహ్మ ముహూర్తము మరియు సంధ్యా సమయము విశిష్టతను గురించి తెలపడం జరిగినది.
నేటి ఆహారమే రేపటి మనసు! అని స్త్రీ ఆహారమును వండడం ద్వారా తన ఇంటి పరివారమును ఏవిధంగా ఆయురారోగ్యాలతో ప్రేమానురాగములతో, ఆనందోల్లాసములతో నిండిన గృహ స్వర్గసీమగా తీర్చిదిద్దుకోవడం ఎలాగో బోధించడం జరిగినది.
గృహమును ఏవిధంగా శుభ్రపరుచుకోవాలో, ఏవిధంగా అలంకరించుకోవాలో, తద్వారా ఇంటిలో శాంతిని ఎలా స్థాపించాలో బోధించడం జరిగినది. భర్త, పిల్లలతో , అత్తమామలతో, బంధుమిత్రులతో ఏవిధమైనటువంటి భాషను ఉపయోగించాలో, ఏవిధమైన ప్రవర్తనతో మెలగాలో చెప్పడం జరిగింది.
ఒక్కమాటలో చెప్పాంటే ఒక స్త్రీ రోజువారీ జీవితంలో నిద్ర మేల్కొనే సమయం వరకు తన జీవనశైలిని ఏవిధముగా తీర్చిదిద్దుకుంటే నిత్యమూ ఆరోగ్యము, ఆనందము, శాంతి, తృప్తి, ప్రేమతో తన కుటుంబమును, సమాజమును గెలిచి, ఒక ఆదర్శ మహిళగా వెలుగొందుతుందో బోధించడం జరిగినది.
ఈ పుస్తకము చదివి ఆదర్శ మహిళగా  వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. మీరు వెలిగి పదిమంది జీవితాలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను, అటు వారి జీవితాలను ధన్యము చేస్తారని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.12 kg
Dimensions 21.59 × 2 × 13.97 cm