For Women

ఆధునిక మహిళ – 22

₹160

Category:
  • Cash on delivery on every order
  • Delhivery tracking shipped from Hyderabad
  • WhatsApp help before and after you buy
Check delivery

21 books in this series

Complete the ఆధునిక మహిళ series

Description

తొలి పలుకు

ఓమౌజయః శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు అది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.

ఆధునిక మహిళ-22 “ఇల్లాలి ఆరోగ్యమే ఇంటికి రక్ష” అను ఈ పుస్తకము ద్వారా శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి ఓమౌజయాః ప్రేమానంద యోగ సత్సంగములను ఇవ్వడము జరిగినది.

ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు మన వ్యాధి నిరోధక వ్యవస్థను ఎలా అభివృద్ధి చేసుకోవాలి. మన శరీరమును ఆరోగ్యవంతంగా, మనసును ప్రశాంతంగా, హృదయమును తృప్తిగా, ఆత్మను ఆనందంగా ఎలా ఉంచుకోవాలి, మన జీవితాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేసుకోవడం కోసం మనమందరం ఏమి చేయాలి, మన గృహమును ఏవిధంగా ప్రకృతితో, భగవంతునితో, ఆత్మతో, ఈ విశ్వ వసుధైక కుటుంబ తత్త్వంతో అనుసంధానం చేయాలో, సనాతన ధర్మం యొక్క నియమ నిబంధనావళిని జైమహావిభోశ్రీః వారు వివరించడం జరిగింది.

వసుధైక కుటుంబ వేడుకలు అంటే ఏమిటి? శ్రావణమాస ఏకాదశి మహోత్సవము దేనికొరకు జరుపుకుంటారు, ప్రకృతిలో ఈ సంవత్సరం విడుదలయ్యే శక్తి ఏమిటి, మనం అంతరంగములో ఏ విధంగా ఉండాలి, బహిరంగముగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనకు అర్థమయ్యే భాషలో చాలా సులభంగా, మనం ఆచరించదగిన పద్ధతులతో జైమహావిభోశ్రీః వారు చాలా అద్భుతంగా వివరించారు.

ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.

ఇట్లు

ఓమౌజయాః మహాధర్మ సేవలో

ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి

No reviews yet Bought this? Be the first to share your experience – photos are very welcome.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.