ఆధునిక మహిళ – 2 – ప్రపంచ విజేతగా జీవించేకళ

60

స్త్రీలను శక్తివంతులుగా, చైతన్యమూర్తులుగా, ప్రేమ స్వరూపులుగా, జ్ఞానసంపన్నులుగా తయారు చేసి, వారి స్వేచ్ఛాస్వతంత్రాలను హక్కులను వారికి ప్రసాదించి భౌతికముగా ఆధ్యాత్మికముగా వారి యొక్క స్థితి స్థానం స్థాయిలను వారికి అందించి వారిలోని ప్రజ్ఞాపాటవాలను సృజనాత్మకతను వెలికితీసి వారిని ఒక ప్రపంచశక్తిగా, ఆధ్యాత్మిక స్పూర్తిగా అవతరింపచేసి ఈ భారతావనికి యావత్‌ జగత్తుకు వారిని వెలుగు దివ్వేలుగా చేసి, ఆ  వెలుగు విశ్వవ్యాప్తమై విరాజిల్లేలా చేయడానికే ‘‘స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారి దివ్య హస్తాలతో ప్రారంభించబడినదే ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
స్త్రీని పాపముగా ఆధ్యాత్మికానికి ఆమెను తీరని శాపముగా చిత్రీకరించిన యావత్‌ అజ్ఞానపు సమాజానికి సమాధానమే ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
ప్రకృతి తత్త్వ భారతీయ ఋషీధర్మపీఠం అనుసారముగా ఒక శ్రేష్ఠ మహిళను సృష్టించుకొనుటకై మొగ్గతొడిగినదే  ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
తరతరాల అణచివేతకు గురిన స్త్రీలను అన్నిటా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుటకై ఆవిర్భవించినదే ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
స్త్రీ ఆధ్యాత్మికానికి అడ్డుగోడ కాదని ఆమె ఆధ్యాత్మికం యొక్క అనంత శూన్యాకాశపు ముఖద్వారమని ఈ అచేతన ప్రపంచానికి చాటి చెప్పుటకై ఉద్భవించినదే ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
ఆడది అంటే మన ముంగిట నడయాడే ప్రకృతి మాత అని ఆమె మన ఇంట కొలువున్న దేవతయని సాక్షాత్‌ శక్తి స్వరూపిణియని పునరుద్ఘాటించడానికి అవతరించినదే ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
స్త్రీ అంటే పురుషుడి చేతిలో యంత్రం కాదని, ఆమె ఆరాధింపదగిన యంత్రానుష్ఠాన దేవతయని ఎలుగెత్తి చాటుటకై ఏర్పడినదే ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
స్త్రీ ఒక భోగవస్తువు కాదని ఆమె మన పాలిట సర్వ భాగ్య ప్రదాతయని, ప్రపంచ భవిష్యత్తు ఆమెయేనని ప్రభోధించుట కొరకు స్థాపించబడినదే ఈ ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’.
ఈ ఆధునిక మహిళ-2(  ప్రపంచ విజేతగా జీవించే కళ) అను పుస్తకము ద్వారా జైమహావిభోశ్రీ: వారిచే మహిళకు ప్రత్యేకంగా బోధింపబడిన ఒక దివ్య సత్సంగమును మీకు అందిస్తున్నాము. ఇందులో స్త్రీ తత్త్వం గురించి ఓంకార, శ్రీచక్ర విద్య గురించి వాటిని సిద్ధింపచేసుకునే ముద్రా ధ్యానము గురించి, స్త్రీ తనలోని శక్తి కేంద్రమును విస్ఫోటనం చెందించుట కొరకై దృష్టి, ఆసనము గురించి వివరింపబడినది. ఒక స్త్రీ తన కట్టుబొట్టును ఇంటాబయటా మెలగవలసిన రీతిని, కుటుంబంలో సమాజంలో ఏ విధముగా అభివృద్ధిని విజయమును సత్సంబంధములను నెలకొల్పు కోవాలో ఈ పుస్తకంలో  జైమహావిభోశ్రీ: వారు వివరించారు.
స్త్రీ తన జీవితంలో విద్యను, ధనమును, సంకల్ప సిద్ధిని, కాలమును, విధిని సిద్ధింపచేసుకొని తన దేహ మనో ఆత్మను పవిత్ర పరుచుకొని ఏవిధముగా ఇటు భౌతికముగా, ఆధ్యాత్మికముగా ఇటు ప్రపంచపరముగా అటు ప్రకృతి పరముగా, ఇటు కుటుంబ పరముగా అటు సమాజపరముగా ఏ విధముగా  సమతుల్య  సమగ్ర జీవనమును సృష్టించుకొని తన స్త్రీ తత్త్వమును సాక్షాత్కరింపజేసుకొని తనను తాను అనుభూతి చెంది జీవిత పరమార్థమును సిద్ధింపజేసుకొని తాను జీవన్ముక్తురాలు ఎలా కావాలో ‘జైమహావిభోశ్రీ:’ వారు ఈ పుస్తకము ద్వారా వివరించారు.
ప్రతి స్త్రీ తప్పక చదివవలసిన పుస్తకం ఇది. ప్రతి ఇంటిలోనూ ఇది ఒక  వెలుగు దీపం. ప్రతి మహిళ చేతిలో ఇది ఒక మార్గదర్శక దిక్సూచి కాబట్టి మహిళలారా ఈ పుస్తకాన్ని చదవండి! చదివించండి! మీ జీవితాలను తరింపచేసుకోండి. పదిమంది జీవితాను తరింపచేయండి!

Category:

Additional information

Weight 0.131 kg
Dimensions 21.59 × 2 × 13.97 cm