ఆధునిక మహిళ – 6 – గృహమే స్వర్గం

90

స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళలకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారము హైదరాబాద్‌ ఆశ్రమము నందు జైమహావిభోశ్రీః వారి యొక్క దివ్య సత్సంగాలు మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించబడును. ఈ పుస్తకములో జైమహావిభోశ్రీః వారి యొక్క ఒక దివ్య సత్సంగములలోని విషయాలను మీకు అందించడం జరిగినది.
ఆధునిక మహిళ-6 గృహమే స్వర్గం అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారి యొక్క రెండు ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి సత్సంగాలను ఇవ్వడము జరిగినది.
స్త్రీలోని జాతులను, వాటి వివరణను ఈ సత్సంగము ద్వారా జైమహావిభోశ్రీ: వారు వివరించారు. స్త్రీజాతిలో పరాకాష్ట అయినటువంటి శ్రీ: అను స్త్రీ తత్త్వము యొక్క విశిష్టతను వివరించడం జరిగినది.
అలాగే స్త్రీ తన జీవితం మొత్తంలో ఎదుర్కొనే కుటుంబ, ప్రాపంచిక, ప్రకృతి, బంధుమిత్ర, మానసిక, వ్యక్తిగత, ఆధ్యాత్మిక పరిస్థితును, వాటిని ఎదుర్కొనే విధివిధానమును ఈ పుస్తకము నందు వివరించడం జరిగినది.
ఈ పుస్తకము చదివి ఆదర్శ మహిళగా  వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. మీరు వెలిగి పదిమంది జీవితాలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను, అటు వారి జీవితాలను ధన్యము చేస్తారని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.203 kg
Dimensions 21.59 × 2 × 13.97 cm